ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. నెలకు రూ.1500లు కడితే.. కోటి రూపాయలు..

ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. నెలకు రూ.1500లు కడితే.. కోటి రూపాయలు..

బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరో కొత్త పాలసీని లాంచ్ చేసింది. అదే ఎల్‌ఐసీ టెక్ టర్మ్ ప్లాన్. ఇది ఆన్‌లైన్ టెర్మ్ పాలసీ. ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.50 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. పాలసీ దారుడికి కచ్చితంగా రెగ్యులర్‌ ఆదాయం వచ్చే మార్గం ఉండాలి. ఏడాదికి ఒకసారైనా అంటే వార్షిక ప్రీమియం చెల్లించొచ్చు. లేదంటే 3 నెలలకోసారి, 6 నెలలకోసారి కూడా చెల్లించొచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు.. గరిష్టంగా 40 ఏళ్ల వరకు వర్తిస్తుంది. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. 80 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ లభిస్తుంది.

పాలసీతో పాటు యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కూడా తీసుకోవచ్చు. అయితే దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం మాత్రం పొగతాగే వారికి ఒక విధంగా, తాగని వారికి ఒక విధంగా ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అమెక్స్ కార్డు, యూపీఐ, ఐఎంపీఎస్, ఇ-వాలెట్స్ వీటిల్లో ఏదో ఒక దాని ద్వారా ప్రీమియం చెల్లించొచ్చు. పాలసీని ఆన్‌లైన్‌లో మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇంటి అడ్రస్‌కు వస్తాయి. ఎలాంటి మెడికల్ టెస్టులు అవసరం లేకుండానే పాలసీ తీసుకోవచ్చు. ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌కు వెళ్లి పాలసీకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని పాలసీ తీసుకుంటే మంచిది.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story