ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై నెటిజన్ల ఫైర్‌

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై నెటిజన్ల ఫైర్‌

ఆటో మొబైల్ రంగం రోజు రోజుకు సంక్షోభంలోకి జారుకోవడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యువత ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్‌ ను ఆశ్రయిస్తున్నారని, సొంతకార్లవైపు మొగ్గు చూపడం లేదని అన్నారు. ఈఎంఐ భారం మోసేందుకు ఇష్టపడటం లేదని క్యాబ్స్‌లపై ఆసక్తి చూపడంతోనే ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందన్నారు. అయితే దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థికమంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పనిలో పనిగా కొత్త మోటారు సవరణ చట్టంపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. డ్రైవింగ్ టెన్షన్స్, నిబంధనల ఉల్లంఘనల చలాన్లు, పార్కింగ్ ఇబ్బందులు ఉండవు. అందుకే వాహనాలు కొనుగోలు చేయటం లేదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. నిరుద్యోగులు ఉద్యోగం చేసేందుకు ఇష్టపడకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story