ఆమె అంటే నాకిష్టం..

ఆమె అంటే నాకిష్టం..

గుత్తా జ్వాల తను స్నేహితులమని నటుడు విష్ణు విశాల్ తెలిపారు. తాజాగా ఆయన బాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాలతో క్లోజ్‌గా తీసుకున్న ఓ సెల్ఫీ ఫొటోనr ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ఫోటోపై సామాజిక మాధ్యమాల్లో గాసిప్స్ మెుదలయ్యాయి. దీంతో విష్ణు ఈ విషయంపై వివరణ ఇచ్చారు.'గుత్తా జ్వాల తాను మంచి స్నేహితులం. జ్వాల అంటే ఇష్టం. ఆమెకు కూడా నేనంటే ఇష్టం. ఏడాది కాలంగా తాము ఒకరికి ఒకరు తెలుసు. స్నేహితులుగా సరాదగా ఉంటాం, కలిసి కాలక్షేపం చేస్తుంటాం. ఇప్పటివరకు మేమిద్దరం స్నేహితులం మాత్రమే. ఈ బంధం మరో దశకు వెళ్తుందా..? అనే ప్రశ్నకు ప్రస్తుతానికి నా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు మేము ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని' తెలిపారు. ‘రాక్షసన్‌’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న విష్ణు. ప్రస్తుతం ‘జగజ్జాల కిలాడి’ చిత్రంలో నటిస్తున్నారు. విష్ణుకు గతంలోనే వివాహమైంది. కోన్నేళ్ళుగా సాఫీగా సాగిన వీరి సంసారం తర్వాత భార్యా భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో గత ఏడాది విడిపోయారు. ఈ మధ్య విష్ణు గుత్తా జ్వాలతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వారిపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story