Sehari Movie Review: 'సెహరి' మూవీ రివ్యూ.. బోర్ కొట్టని ఫ్యామిలీ డ్రామా..

Sehari Movie Review: ఒక చిన్న సినిమా, కొత్త హీరో.. అయినా కూడా 'సెహరి'పై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఫీల్ ఉంది. ట్రైలర్ ప్రామిసింగ్‌గా అనిపించడంతో ఈ వీకెండ్‌కు రవితేజ 'ఖిలాడి'కు పోటీగా సెహరి కూడా విడుదలయ్యింది. రెండు వేర్వేరు జోనర్ సినిమాలు. ఒకటి యాక్షన్ డ్రామా అయితే మరొకటి కామెడీ సినిమా. అయితే ఖిలాడి లాగానే సెహరికి కూడా అంతటా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సెహరి'. ఈ సినిమా పోస్టర్ లాంచ్‌లో బాలకృష్ణ పాల్గొన్న దగ్గర నుండి దీనిపై అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక సెహరి ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఇది మినిమమ్ గ్యారెంటీ చిత్రమని అర్థమయ్యింది. అనుకున్నట్టుగానే ఇది ఒక టైమ్ పాస్ కామెడీ డ్రామా అంటున్నారు చూసిన ప్రేక్షకులు.
#HarshKanumilli @HarshKanumilli's performance in #Sehari #SehariMovie 👌 pic.twitter.com/sJJzfZnXDX
— BuzZ Basket (@ursBuzzBasket) February 11, 2022
హీరోయిన్ తప్ప హీరో, దర్శకుడు సెహరితోనే టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. హర్ష్ కేవలం ఇందులో హీరోగానే కాకుండా కథను కూడా అందించడం విశేషం. ఇది హర్ష్‌కు ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అయినా.. పలు షార్ట్ ఫిల్మ్స్‌తో మాత్రం యూట్యూబ్ ప్రేక్షకులకు ముందుగానే పరిచయం. సెహరిలో మెయిన్ ప్లస్‌గా మారింది కామెడీ అయితే.. ఈ మూవీని నిలబెట్టిన మరో అంశం మాత్రం హర్ష్ ఇన్నోసెంట్ యాక్టింటే అంటున్నారు నెటిజన్లు.
సెహరి కథ విషయానికి వస్తే.. వరుణ్ పాత్రలో కనిపించిన హర్ష్.. ఒక అమ్మాయితో బ్రేకప్ అయ్యి బాధలో ఉంటాడు. అందుకే ఇక లవ్ లాంటివి వద్దని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతాడు. అప్పుడే తన లైఫ్‌లోకి సిమ్రాన్ వస్తుంది. తనతో ప్రేమలో పడతాడు. తీరా చూస్తే.. తానే పెళ్లికూతురు అక్క అని తెలుస్తుంది. ఇక అప్పటినుండి ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో తెరపై చూడాల్సిందే.
#Sehari is a beautiful ROM COM i've watched in recent times..Completely Fresh & Entertaining😀Newbie @HarshKanumilli has done it with so much of ease &his dialogue delivery is so peculiar..Hilarious Entertainer to watch with family & friends 🤗Gud Job &Congrats @gnanasagardwara🤟 pic.twitter.com/VlJUYQ0gEg
— 🅰︎🅲︎🅷︎🅰︎🆁︎🆈︎🅰︎|𝕽𝖆𝖒𝖚𝕶𝖆𝖗𝖓𝖆𝖙𝖎 (@KarnatiRamu) February 10, 2022
సినిమాలోని మెయిన్ ప్లాట్‌ను ట్రైలర్‌లోనే చెప్పేసినా.. ఏ ఒక్క చోట కూడా బోర్ కొట్టకుండా కథను బాగా నడిపించారు. అభినవ్ గోమాటమ్.. మరోసారి కామెడీ పాత్రలో నూటికి నూరుశాతం మార్కులు కొట్టేశాడు. పూర్తిగా ఫ్యామిలీతో చూడగలిగే సినిమాలాగా దీనిని తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన సంగీతంలోని పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com