రేపు PSLV-C55 రాకెట్‌ ప్రయోగించనున్న ఇస్రో

రేపు PSLV-C55 రాకెట్‌ ప్రయోగించనున్న ఇస్రో

ఇస్రో మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సిద్దమైంది . తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని షార్‌ నుంచి రేపు PSLV-C55 రాకెట్‌ ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా సింగపూర్‌ చెందిన 741 కిలోల బరువు గల టెల్‌ ఈవోఎస్‌-2 ఉపగ్రహంతో పాటు 16 కిలోల బరువైన మరో చిన్న ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ఇవాళ ఉదయం 11.49 గంటలకు ప్రారంభమవుతుంది. కౌంట్‌డౌన్‌ 25.30 గంటలు కొనసాగిన తరువాత రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది. నిన్న శాస్త్రవేత్తలు రాకెట్‌ రిహార్సల్‌ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు రిహార్సల్‌లో భాగంగా రాకెట్‌ను మొబైల్‌ సర్వీసు టవర్‌ నుంచి వెనక్కి తీసుకెళ్లారు. రాకెట్‌లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నీ సజావుగా సాగితే రేపు మధ్యాహ్నం 2.19 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

Tags

Read MoreRead Less
Next Story