Apps Ban: బ్యాన్ కానున్న మరో 54 చైనా యాప్స్.. ఎప్పుడంటే..

Apps Ban: బ్యాన్ కానున్న మరో 54 చైనా యాప్స్.. ఎప్పుడంటే..
Apps Ban: దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో మరో 54 చైనా యాప్స్‌పై నిషేధం విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

Apps Ban: దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో మరో 54 చైనా యాప్స్‌పై నిషేధం విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ, సెల్ఫీ కెమెరా, ఫ్రీ ఫైర్, వైవా వీడియో ఎడిటర్, యాప్ లాక్‌, డ్యూయల్‌ స్పేస్‌ లైట్ లాంటి యాప్స్ ఉన్నాయి.దేశ సార్వభౌమాధికారం, సమగ్రత,భద్రతలకు ఈ యాప్స్‌ భంగం కలిగిస్తుండడమే కారణమని అధికార వర్గాలు తెలిపాయి.

యూజర్లకు సంబంధించిన డేటా సేకరించి..మాతృదేశానికి చెరవేస్తున్నాయని ఆరోపించారు. గతేడాది జూన్‌లో 59 చైనా యాప్‌లపై నిషేధించింది కేంద్రం. వీటిలో పాపులర్‌ యాప్స్ టిక్‌ టాక్‌, వియ్‌ చాట్ లాంటి యాప్స్ ఉన్నాయి. ఐటీ యాక్ట్-69A సెక్షన్ కింద ఈ యాప్స్ బ్యాన్ చేసినట్లు తెలిపింది కేంద్ర సమాచార శాఖ.

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 300 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించింది. గాల్వాన్ లోయలో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటన తర్వాత 2020 జూన్‌లో దేశ భద్రతకు ముప్పుగా ఉన్న కొన్ని చైనా యాప్స్‌ను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్రం మొదటి సారి ప్రకటన చేసింది.

Tags

Read MoreRead Less
Next Story