I-DAY 2023: 954 మందికి పోలీసు పతకాలు

I-DAY 2023: 954 మందికి పోలీసు పతకాలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్రం... లౌక్రక్‌పామ్‌ ఇబోంచా సింగ్‌కు రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా(announced on Independence Day eve) కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాల(954 police medals)ను ప్రకటించింది. అవార్డుల జాబితాను కేంద్ర హోంశాఖ(Union Ministry of home affairs)విడుదల చేసింది. ఇందులో 229 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ ( Police Medal for Gallantry), 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు(PPM), 642 మందికి పోలీస్‌ విశిష్ట సేవా (Police Medal for Meritorious Service) పతకాలను ప్రకటించింది.


పోలీస్‌ మెడల్స్‌ ఫర్‌ గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నవారిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్‌ నుంచి 55 మంది పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్‌ నుంచి 27, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 24 మందికి పీఎంజీ పతకాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం( President's Police Medal for Gallantry) ఒకరిని వరించింది. సీఆర్పీఎఫ్‌ అధికారి లౌక్రక్‌పామ్‌ ఇబోంచా సింగ్‌( Loukrakpam Ibomcha Singh)కు ఈ పురస్కారం అందుకోనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ నుంచి 29 మందికి పతకాలు దక్కాయి. 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. తెలంగాణ నుంచి 34 మంది పతకాలకు ఎంపికయ్యారు. 22 మందికి పోలీస్‌ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story