Tamil Nadu: బిర్యానీ లేదు.. అందుకే పెళ్లి వాయిదా..!

Tamil Nadu: బిర్యానీ లేదు.. అందుకే పెళ్లి వాయిదా..!
Tamil Nadu: ఆ పెళ్లివారు జొమాటో నుండి 3,500 కిలోల మాంసాన్ని ఆర్డర్ చేశారు.

Tamil Nadu: పెళ్లిల్లకు వెళ్లినప్పుడు ముందుగా చాలామంది గమనించేది అక్కడ ఫుడ్ ఎలా ఉంది అని.. పెళ్లి తంతు అంతా ఎలా జరగిందో మర్చిపోయినా కూడా.. చాలామంది ఆ పెళ్లిలో ఫుడ్ ఎలా ఉందో మర్చిపోరు. అలా.. ఎంతోకాలంగా పెళ్లిలో ఫుడ్ అనేది కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఫుడ్ లేకపోవడంతో రెండు కుటుంబాలు ఏకంగా పెళ్లినే వాయిదా వేసుకున్నాయి.

తమిళనాడులోని ఒరతనాడులో ఓ పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పెళ్లిలో నాన్ వెజ్ బిర్యానీ పెట్టాలని ఇరు కుటుంబాలు అనుకున్నాయి. కానీ సమయానికి మాంసం అందుబాటులో లేదు. అందుకోసమే పెళ్లిని వాయిదా వేశాయి కుటుంబాలు. అయితే మాంసం అందుబాటులో లేకపోవడం వెనుక పెద్ద కథే ఉందని వారు అంటున్నారు.

ఆ పెళ్లివారు జొమాటో నుండి 3,500 కిలోల మాంసాన్ని ఆర్డర్ చేశారు. సరైన సమయానికి బెంగుళూరు నుండి తమిళనాడుకు మాంసాన్ని కూడా వారు పంపించారు. కానీ ఆ మాంసం అంతా కుళ్లిపోయినట్టు పెళ్లివారు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇదే విషయాన్ని ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి మాంసం కుళ్లిందని నిర్ధారించారు. అయితే పెళ్లి సమయానికి మాంసం అందుబాటులో లేకపోవడంతో బంధువుల‌కు భోజ‌నం పెట్టకుండా పంపడం సంస్కారం కాదని భావించి వారు పెళ్లినే వాయిదా వేశారు.



Tags

Read MoreRead Less
Next Story