Balasore: త్రుటిలో తప్పిన మరో ఘోర రైలు ప్రమాదం

Balasore: త్రుటిలో తప్పిన మరో ఘోర రైలు ప్రమాదం
బాలాసోర్‌లో తప్పిన ఘోర రైలు ప్రమాదం....లూప్‌ లైన్‌లోకి ప్రవేశించిన రైలు.. లోకో పైలెట్‌ అప్రమత్తతతో తప్పిన ఘోరం....

290 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా బాలేశ్వర్ లో మరో రైలు ప్రమాదం(train accident) త్రుటిలో(averted) తప్పింది. సిగ్నలింగ్ లో లోపం వల్ల మరమ్మతులు జరుగుతున్న లూప్ లైన్(loop line) లోకి రైలు ప్రవేశించింది. అయితే లోకోపైలట్(loco pilot) అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లూప్ లైన్ పనులు జరుగుతున్న విషయాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు జరుగుతున్న లైన్ లోకి సిగ్నల్ ఇవ్వడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.


దీనిపై సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిగ్నలింగ్ లో తలెత్తిన లోపాన్ని సరిదిద్ది రైలు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనతో భద్రక్ నుంచి బాలేశ్వర్ లైనులో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. మరమ్మతు చేస్తున్న లైనులో ముందుకు వెళితే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు.

జూన్ 2న రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదంలో 293 మంది మరణించారు. 1,200 మందికి పైగా గాయపడ్డారు. రద్దీగా ఉండే మార్గంలో గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదానికి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించినట్లు చెప్పిన వారాల తర్వాత అరెస్టు జరిగింది. రైళ్ల ఉనికిని గుర్తించే ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ట్యాంపరింగ్ చేయడం వల్ల ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.


ఈ రైలు ప్రమాదంలో ముగ్గురు నిందితులుగా ఉన్న రైల్వే అధికారులను సీబీఐ జులై 7న సీబీఐ అరెస్ట్ చేసింది. రైల్వే శాఖ సస్పెన్షన్‌ విధించిన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌) అరుణ్‌కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజినీర్‌ మహ్మద్‌ అమీర్‌ఖాన్‌, టెక్నీషియన్‌ పప్పుకుమార్‌లకు ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానం జులై 7న ఐదు రోజుల రిమాండ్‌ను విధించింది. జులై 11న దర్యాప్తు సంస్థ అభ్యర్థన మేరకు కోర్టు రిమాండ్ వ్యవధిని మరో నాలుగు రోజులు పొడిగించింది. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, కేసు తదుపరి విచారణను జూలై 27న కోర్టు వాయిదా వేసింది.

ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 304, 201, రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేయబడింది. ఈ కేసుపై సీబీఐ ఇంకా తన నివేదికను సమర్పించనుండగా, సిగ్నలింగ్ సర్క్యూట్ మార్పులో లాప్స్ కారణంగా ప్రమాదం జరిగిందని సౌత్ ఈస్టర్న్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) విచారణ నివేదిక పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story