SBI : ఎన్నికలు లేట్ అవుతాయా..? ఎలక్టోరల్ బాండ్లపై SBI ఆలస్యం అందుకేనా..??

SBI : ఎన్నికలు లేట్ అవుతాయా..? ఎలక్టోరల్ బాండ్లపై SBI ఆలస్యం అందుకేనా..??

ఈ ఏడాది మార్చి 6 లోగా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే ఎస్‌బీఐని ఆదేశించింది. కానీ ఎస్‌బీఐ ఇవ్వలేదు. జూన్‌ 30 వరకు గడువును కోరుతూ ఎస్‌బీఐ.. సుప్రీంకోర్టులో దరఖాస్తును దాఖలు చేసింది. ఇలాంటి తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎస్‌బీఐ.. ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన పత్రాలను తన వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఎస్‌బీఐ చేసిన ఈ పనిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో 'ఫ్రీక్వెంట్లీ ఆస్‌క్డ్‌ క్వశ్చన్స్‌', 'ఆపరేటింగ్‌ గైడ్‌లైన్స్‌ ఫర్‌ డోనర్స్‌' పేరుతో ఉన్న లింక్‌లు, వెబ్‌పేజ్‌లు ఇప్పుడు కనబడటం లేదు. సుప్రీంకోర్టు ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నిలక సంఘానికి అందించటం కోసం ఎస్‌బీఐ మరో నాలుగు నెలల గడువును కోరుతోంది. ఇంత గడువు ఎందుకు … ఒక్క క్లిక్ తో వచ్చే సమాచారాన్ని ఇవ్వడానికి ఇబ్బందేమిటన్నది చాలా మందికి తెలిసిన విషయం.

జూన్‌ లోపే షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశముంటుంది. ఆ లోగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం బహిర్గతమైతే అధిక విరాళాలు అందుకున్న బీజేపీ లాంటి పార్టీలకు పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని.. అందుకే గడువు కోరుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎస్‌బీఐ గడువును జూన్‌ 30 వరకు కోరి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు కూడా లేటయ్యే చాన్సుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story