PRS Oberoi: ఒబెరాయ్ హోటల్స్ వ్యవస్థాపకుడు పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూత

PRS Oberoi:  ఒబెరాయ్ హోటల్స్ వ్యవస్థాపకుడు పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూత
భారత్‌లో హోటల్ బిజినెస్ ముఖచిత్రాన్ని మార్చిన ఒబెరాయ్

ఆతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో ఆయన ప్రశాంతంగా కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. తమ ప్రియతమ నాయకుడు పీఆర్ఎస్ ఒబెరాయ్ తమను విడిచి వెళ్లారని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నామని గ్రూప్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆయన మరణం ఒబెరాయ్ గ్రూప్‌తో పాటు భారత్ సహా విదేశీ ఆతిథ్య రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. పీఆర్ఎస్ ఒబెరాయ్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయని ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. ఢిల్లీలోని పకషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫామ్‌లో అంత్యక్రియలు జరగుతాయని వెల్లడించింది. అంత్యక్రియులు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయని వివరించారు. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్‌ ఫామ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు.

పీఆర్ఎస్ ఒబెరాయ్ దూర దృష్టి గల నాయకుడని, అంకితభావం, మక్కువతో ఒబెరాయ్ గ్రూప్, హోటళ్లను ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దారని ఓ ప్రకటనలో గ్రూప్ పేర్కొంది. ఆయన విస్తరించిన హోటళ్లు భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగాన్ని ప్రభావితం చేస్తాయని కంపెనీ ఆశాభవం వ్యక్తం చేసింది. పీఆర్ఎస్ ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్త రూపు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. ఒబెరాయ్ గ్రూప్ 1934లో ఏర్పాటైంది. ఢిల్లీ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది. 7 దేశాలలో 32 లగ్జరీ హోటళ్లు, 7 క్రూయిజ్ షిప్స్ ఉన్నాయి.

పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్ దేశానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా 2008 జనవరిలో భారత ప్రభుత్వం.. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఒబెరాయ్ గ్రూప్‌ ను ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ హోటళ్లలో ఒకటిగా అభివృద్ధి చేయడంలో పీఆర్ఎస్ ఒబెరాయ్ అసాధారణ నాయకత్వం, దూర దృష్టి, సహకారానికి గానూ.. ది ఇంటర్నేషనల్ లగ్జరీ ట్రావెల్ మార్కెట్ (ILTM) 2012, డిసెంబర్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందించింది. అలాగే హోటల్స్ మ్యాగజైన్ 2010లో పీఆర్ఎస్ ఒబెరాయ్‌ని 2010 కార్పొరేట్ హొటెలర్ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తించింది. 150 కి పైగా దేశాల్లోని తమ రీడర్ల ఓటింగ్ ద్వారా పీఆర్ఎస్ ఒబెరాయ్‌ని ఎంపిక చేసింది. నవంబర్ ఎడిషన్‌లో భారత్‌లో ఆధునిక లగ్జరీ ఆతిథ్య రంగానికి స్థాపకుడిగా పేర్కొంటూ కథనం ప్రచురించింది.

Tags

Read MoreRead Less
Next Story