Delhi: మరోసారి రెడ్ అలెర్ట్

Delhi: మరోసారి రెడ్ అలెర్ట్
పొద్దున్నే మరోసారి తడిసి ముద్దయిన ఢిల్లీ

దేశంలో చాలా చోట్లభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి పలు ప్రాంతాలు నీట మునిగాయి. సహా ఉత్తర భారతాన్ని వర్షాలు వణికించ్చాయి. అయితే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డట్టే అని అనుకున్నప్పటికీ, ఇంకా బయటపడలేదనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఆకస్మిక వరదలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి.

తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. యమునా నది ఉపనది హిండన్ నది నీటి మట్టం పెరగడంతో గ్రేటర్ నోయిడాలోని ఓ మైదానంలో 400కు పైగా కార్లు పైకప్పుల వరకు మునిగిపోయాయి. గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఆ కార్ల పైకప్పులు కేవలం ఒక అంగుళం మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. హిండన్ నది నీటిమట్టం పెరగడంతో అప్పటికే నదికి సమీపంలోని వారిని ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి.యమునా నది ఢిల్లీ పరిధిలో ప్రస్తుతానికి 48 కి.మీ. మేరకు ప్రవహిస్తుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించింది. జూలై 10న సంభవించిన వరదల కారణంగా రాజధాని నగరానికి రూ.10 వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా.


ఇక బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని కొన్ని ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. భారత వాతావరణ విభాగం దేశ రాజధాని లోని చాలా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story