RAIN ALERT: దేశంలో దంచికొడుతున్న వానలు

RAIN ALERT: దేశంలో దంచికొడుతున్న వానలు
దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... ముంబైకు ఎల్లో అలర్ట్‌ జారీ... అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..

దేశవ్యాప్తంగా వర్షాలు(Heavy rains ‌) దంచికొడుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపై నుంచి వరద(floods) ప్రవహిస్తోంది. జన జీవనం స్తంభించిపోయింది. అధికారులు అప్రత్తమై సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


ముంబై( lashed Mumbai)లో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు( heavy showers) కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరిందని అధికారులు తెలిపారు. ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ( India Meteorological Department) హెచ్చరికలతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) విద్యాసంస్థలకు(SCHOOLS) సెలవు ప్రకటించింది. పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు ముంబైలో 223.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని హెచ్చరించారు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబై(Mumbai)లో భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో వాతవారణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.


పంజాబ్‌(PUNJAB) అమృత్‌సర్‌(AMRITSAR)లో నిన్న రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా... వర్షం కురుస్తూనే ఉంది. కుండపోతతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


నాగ్‌పుర్‌(NAGPUR)లోనూ భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. నరేంద్రనగర్‌ అండర్‌ బ్రిడ్‌, ఎయిర్‌పోర్టు మార్గాల్లో భారీగా వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


శ్రీనగర్‌(SRINAGAR)లోనూ విస్తారంగా వర్షాలు(Heavy rains ‌) కురుస్తున్నాయి. శ్రీనగర్‌ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story