92 ఏళ్ల వయసులో నెరవేరిన కల.. బడికి వెళ్లి పాఠాలు చదువుతూ..

92 ఏళ్ల వయసులో నెరవేరిన కల.. బడికి వెళ్లి పాఠాలు చదువుతూ..
చదువుకు వయసుతో పనేముంది.. చదువుకోవాలన్న ఉత్సాహం ఉండాలే కాని ఏ వయసు వారైనా చదువుకోవచ్చు. అదే విద్య యొక్క గొప్పతనం.

చదువుకు వయసుతో పనేముంది.. చదువుకోవాలన్న ఉత్సాహం ఉండాలే కాని ఏ వయసు వారైనా చదువుకోవచ్చు. అదే విద్య యొక్క గొప్పతనం.బులంద్‌షహర్ నివాసి సలీమా ఖాన్ 92 ఏళ్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థి. ఈ వయస్సులో చదవడం, వ్రాయడం నేర్చుకుంటున్నారు. 'ఖాన్ చాచీ' అని ఆమెను ఆత్మీయంగా పిలుచుకుంటారు చుట్టుపక్కల వారు, బంధువులతో సహా. ఆమెకు చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. కానీ ఆమెకు తన మొత్తం జీవితంలో చదువుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు.

కానీ ఇప్పుడు 92 సంవత్సరాల వయస్సులో ప్రాథమిక పాఠశాలకు వెళుతోంది. చదువుకోవాలన్న ఆసక్తే ఆమెను బడి వైపు అడుగులు వేయించింది. అంకితభావం, సంకల్పం, నేర్చుకోవాలనే తపన ఆమెను ఒక చోట ఖాళీగా కూర్చోనివ్వలేదు. అాదే ఆమెను ప్రతిరోజూ పాఠశాలకు తీసుకువస్తుంది. ఆమె తన మనవరాలు ఫిర్దౌస్‌తో కలిసి హాజరవుతుంది.

సలీమా ఖాన్, 92 ఏళ్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థి

సలీమా ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని చావ్లీ గ్రామంలో నివసిస్తున్నారు. 92 సంవత్సరాల వయస్సులో చదవడం మరియు వ్రాయడం నేర్చుకోవడం కోసం పాఠశాలలో అడుగుపెట్టినందున సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సలీమా ఖాన్ కుటుంబ సభ్యుల సహాయంతో పాఠశాలకు వెళుతుంది. ఈ వయస్సులో తాను చదువుకుంటున్నందుకు గర్వపడుతున్నానని చెప్పింది, 'నేను నా పేరు మీద సంతకం చేయడం నేర్చుకున్నాను అని బోసినవ్వుల బామ్మ ఆనందంతో చెబుతోంది.

ఆమె చదువుతున్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, డాక్టర్ ప్రతిభా శర్మ మాట్లాడుతూ.. 'సలీమా ఎనిమిది నెలల క్రితం మా వద్దకు వచ్చి తరగతి గదిలో కూర్చోవడానికి అనుమతించమని అభ్యర్థించారు. అటువంటి వృద్ధురాలికి విద్యను అందించడం చాలా కష్టం, కాబట్టి మేము మొదట్లో కొంత సంకోచించాము. అయితే, ఆమె జీవితంలోని శరదృతువులో చదువుకోవాలనే ఆమె మక్కువ మమ్మల్ని మార్చేలా చేసింది. ఆమెను తిరస్కరించేందుకు మాకు మనసు రాలేదు.' 1 నుండి 100 వరకు అంకెలు నేర్పించడం, అక్షరాలు నేర్పించడం చేస్తున్నాము అని ఆమె చెప్పారు.

'ఖాన్ చాచీ' అంకితభావం అందరికీ స్ఫూర్తిని ఇస్తుంది.

సలీమా ఖాన్ తన చుట్టూ ఉన్న చాలా మంది మహిళలకు గొప్ప ప్రేరణ. సలీమాను చూసి గ్రామానికి చెందిన 25 మంది మహిళలు, ఆమె ఇద్దరు కోడళ్లు తరగతుల్లో చేరేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు వారి కోసం ప్రత్యేక సమావేశాలు ప్రారంభించాం.' సలీమా ఖాన్ 14 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు. ఆమె గ్రామంలో పాఠశాలలు లేవు. పెళ్లి తరువాత పిల్లలు, వారిని పెంచి పెద్ద చేయడం, వాళ్లకి పెళ్లిళ్లు, పిల్లలు వీటితోనే జీవితం మొత్తం గడిచి పోయింది. చదువుకోవాలని ఉన్న తన కోరిక అలానే మిగిలిపోయింది.

పాఠశాలలో చేరిన మొదటి రోజు గురించి సలీమా మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయురాలు తనకు పుస్తకం ఇస్తే పెన్ను పట్టుకోవడం కూడా తెలియక చేతులు వణుకుతున్నాయని చెప్పింది. అయితే తన ఆనందానికి అవధులు లేవని పేర్కొంది. 'ఖాన్ చాచీ' నేర్చుకునేందుకు వయస్సు లేదని మరోసారి నిరూపించింది.

Tags

Read MoreRead Less
Next Story