మా అమ్మను మా నాన్నే చంపాడు.. కోర్టులో సాక్ష్యం చెప్పిన నాలుగేళ్ల బాలుడు

మా అమ్మను మా నాన్నే చంపాడు.. కోర్టులో సాక్ష్యం చెప్పిన నాలుగేళ్ల బాలుడు
పట్టుమని పదేళ్లు కూడా లేవు వాడికేం తెలుసనుకున్నాడు.. నాలుగేళ్ల తన కొడుకు ముందే తన భార్యను చంపేశాడు ఓ దంత వైద్యుడు.

పట్టుమని పదేళ్లు కూడా లేవు వాడికేం తెలుసనుకున్నాడు.. నాలుగేళ్ల తన కొడుకు ముందే తన భార్యను చంపేశాడు ఓ దంత వైద్యుడు. కానీ ఆ చిన్నారి సాక్ష్యం కారణంగా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.చాలా పనులు చిన్న పిల్లల ముందే చేస్తుంటారు పెద్ద వాళ్లు. వాళ్లకేం తెలుసనుకుంటారు.. కానీ ఆ చిట్టి బుర్ర కూడా చాలా విషయాలు నిక్షిప్తం చేసుకుంటుందని తెలుసుకోరు.. పిల్లల ముందే తల్లిదండ్రులు గొడవ పడుతుంటారు.. కొట్టుకుంటారు.. మాట్లాడకూడని విషయాలు మాట్లాడుకుంటారు.. కానీ వారి మీద ఎంతటి ప్రభావం చూపిస్తాయో అస్సలు ఆలోచించరు.

మా నాన్న ఆమెను కత్తితో చంపాడు" అని తల్లి హత్యను చూసిన నాలుగేళ్ల కొడుకు కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పాడు. తన తల్లిని దారుణంగా హత్య చేయడాన్ని చూసిన నాలుగు సంవత్సరాల తరువాత, ట్రయల్ కోర్టులో ధైర్యంగా నాలుగేళ్ల బాలుడు సాక్ష్యం చెప్పాడు. ఈ వాంగ్మూలం విన్న కోర్టు సోమవారం దాదర్‌కు చెందిన 48 ఏళ్ల దంతవైద్యుడికి జీవిత ఖైదు విధించడానికి దారితీసింది. బాలుడి సాక్ష్యాన్నే కీలకమైనదిగా పరిగణించింది.

దంతవైద్యుడు ఉమేష్ బోబాలే 2016లో తన 36 ఏళ్ల భార్య తనూజా బోబాలేను దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ విషాద సంఘటన డిసెంబర్ 11, 2016 న జరిగింది. ట్రయల్ కోర్టులో, ఇప్పుడు 2వ తరగతి చదువుతున్న చిన్నారి, ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ అడిగిన 54 ప్రశ్నలకు ధైర్యంగా సమాధానమిచ్చాడు. అతను తన తండ్రిని నేరస్థుడిగా గుర్తించి, "మా నాన్న అమ్మను కత్తితో పొడిచి చంపాడు" అని పేర్కొన్నాడు. ఈ దారుణ హత్యను చూసినప్పటికీ, ఆ ఘటనలో తాను కేకలు వేయలేదని, అయితే చాలా భయపడ్డానని చెప్పాడు.

విచారణలో నిందితుడు అకౌంటెంట్ గా పని చేస్తున్న తన భార్య ఆఫీస్ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చేది. దాంతో ఆమెపై అనుమానం వచ్చేది. అతడి అనుమానం తారాస్థాయికి చేరి పిల్లలకు DNA పరీక్ష కూడా నిర్వహించాడు. దాంతో అతడి అనుమానం నిజం కాదని తేలింది. అయినా సంతృప్తి చెందలేదు.. రోజూ ఆ పేరుతో భార్యను హింసించేవాడు. బాధితురాలి సోదరుడు, నిందితుడి అత్త, బిల్డింగ్ వాచ్‌మెన్‌తో సహా పది మంది సాక్షులను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్‌వి కిని హాజరుపరిచారు. వారి సాక్ష్యాలు ఉమేష్ బోబాలేపై కేసును బలపరిచాయి.

నిందితుడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఇది హింసాత్మక చర్యకు దారితీసిందని డిఫెన్స్ పేర్కొంది. అయితే, కోర్టు ఈ డిఫెన్స్‌ను తిరస్కరించింది నేరం జరిగిన సమయంలో నిందితుడికి తన చర్యల గురించి పూర్తిగా తెలుసునని గుర్తించింది. తీర్పును వెలువరిస్తూ, న్యాయమూర్తి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద హత్యా నేరం కింద నిర్ధారిస్తూ జీవిత ఖైదుతో పాటు రూ.20,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితుడి గత వివాహం కూడా విడాకులతో ముగిసింది. 2016లో అరెస్టయినప్పటి నుంచి ఉమేష్ బోబాలే జైలులో ఉన్నాడు. అతడికి కోర్టు బెయిల్ నిరాకరించింది.

Tags

Read MoreRead Less
Next Story