సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ 77వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా ఆమె సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని ప్రధాన మంత్రి శనివారం 'X'లో పోస్ట్‌ చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా పార్టీ మాజీ అధ్యక్షురాలికి తన శుభాకాంక్షలు 'X' ద్వారా తెలియజేశారు. ఖర్గే ఆమెను "అట్టడుగు వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వనిత అని అభివర్ణించారు. ఆమె ధైర్యం, నిస్వార్థ త్యాగంతో కష్టాలను ఎదుర్కొంటూ దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు. ఆమె దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను' అని ఖర్గే తన 'X' పోస్ట్‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కూడా సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు, సమాజంలోని పేద మరియు అట్టడుగు వర్గాల "ఉద్ధరణ" కోసం పాటుపడిన సోనియా గాంధీని ప్రశంసించారు.

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ జీవిత ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆమె చాలా సవాళ్లతో కూడిన కాలంలో కాంగ్రెస్‌ను ఎంతో సంయమనంతో నడిపించారు. అందరికీ సంక్షేమాన్ని అందించిన , దేశానికి అభివృద్ధిని అందించిన UPA ప్రభుత్వ రూపశిల్పి సోనియా అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు శుభాకాంక్షలు తెలిపారు.

“భక్తితో కూడిన ప్రజా జీవితానికి ఆదర్శంగా నిలిచిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ మేడమ్ సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను' అని స్టాలిన్ అన్నారు. ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేయడంలో సోనియా చేసిన కృషిపై, ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “#భారతదేశాన్ని నిరంకుశ శక్తుల నుండి కాపాడే మా ఐక్య ప్రయత్నంలో ఆమె లోతైన దృక్పథం మరియు అనుభవ సంపద మార్గదర్శక కాంతిగా కొనసాగాలని కోరుకుంటున్నాను.”

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకున్న ఏకైక రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో సోనియా చివరిసారిగా కనిపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల వ్యూహాన్ని రూపొందించేందుకు ఆమె సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Best wishes to Smt. Sonia Gandhi Ji on her birthday. May she be blessed with a long and healthy life.

Tags

Read MoreRead Less
Next Story