Bharat Ratna : పీవీకి భారతరత్న.. అందుకున్న కుటుంబ సభ్యులు

Bharat Ratna : పీవీకి భారతరత్న.. అందుకున్న కుటుంబ సభ్యులు

దేశంలో అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న సహా పౌర పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతిలో భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు (PV Narasimharao) తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.

మిగతా అవార్డీలు కర్పూరీ ఠాకూర్, చౌధురి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ లకు ప్రకటించిన భారతరతర్న పురస్కారాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మాజీ ప్రధాని నరసింహారావు భారతరత్న అవార్డును ఆయన కుమారుడు - పివి ప్రభాకర్ రావు అందుకున్నారు. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ భారతరత్న అవార్డును ఆయన కుమార్తె డాక్టర్ నిత్యారావు అందుకున్నారు. కర్పూరీ ఠాకూర్ భారతరత్న అవార్డును ఆయన కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్‌కు భారతరత్న అవార్డును అతని మనవడు జయంత్ చౌదరికి రాష్ట్రపతి చేతుల మీదుగా అందించారు.

మరోవైపు.. అద్వానీకి కూడా రాష్ట్రపతి పురస్కారం అందించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అద్వానీ ఇంటికెళ్లి భారతరత్న ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం దేశంలోని 5 మంది వ్యక్తులను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించారు. సీనియర్ బిజెపి నాయకుడు లాల్ కృష్ణ అద్వానీని కూడా భారతరత్నతో సత్కరించవలసి ఉంది. కానీ ఈ రోజు ఆయన రాష్ట్రపతి భవన్‌కు హాజరు కాలేదు. మార్చి 31న రాష్ట్రపతి ఆయన ఇంటికి వెళ్లి సన్మానించనున్నారు. అద్వానీ మినహా మిగిలిన నలుగురికి మరణానంతరం భారతరత్న ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను రాష్ట్రపతిని సన్మానించారు.

Tags

Read MoreRead Less
Next Story