Train firing : కాల్పుల నిందితుడిపై సెక్షన్ 153a

Train firing : కాల్పుల నిందితుడిపై  సెక్షన్ 153a
వర్గాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నమే అంటున్నపోలీసులు

జైపూర్-ముంబై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో నలుగురిని కాల్చి చంపిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ను ముంబై కోర్టులో హాజరు పరిచారు. అతనికి విధించిన పోలీసు కస్టడీని ఆగస్టు 11 వరకు పొడిగించారు. చేతన్ సింగ్‌పై IPC సెక్షన్ 153A అంటే మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం కింద కేసు నమోదు చేశారు.

నిందితుడు చేతన్‌ సింగ్‌ తాను వారిని కాల్చిన సమయంలో సృహాలో లేనని పోలీసులకు చెప్పాడు. తన ఎస్కార్ట్ డ్యూటీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఏఎస్‌ఐ టికారమ్ మీనాతో సహా నలుగురిని చంపినట్లు చేతన్‌ అనే ఈ రైల్వే పోలీసుపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. సంఘటన జరిగినప్పుడు తాను స్పృహలో లేననీ, ఆ తర్వాత వెంటనే భార్యకు ఫోన్ చేసి, తప్పు జరిగిపోయిందని, పిల్లల సంరక్షణను ఆమె తీసుకోవలసి ఉంటుందని చెప్పాననీ చెప్పాడు. అయితే, పోలీసులు మాత్రం చేతన్ వాదనలను ఖండించారు. తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే అతను ప్రయత్నిస్తున్నాడన్నారు.


చేతన్ సింగ్ తరపు న్యాయవాది కూడా నిందితుడు మానసికంగా సరిగా లేడన్నారు. అయితే కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. అంత మానసికమైన స్థితి సరిగ్గా లేని వాడు డ్యూటీలో ఎందుకు కొనసాగుతున్నాడు అని ప్రశ్నించింది. అతనికి విధించిన పోలీసు కస్టడీని ఆగస్టు 11 వరకు పొడిగించింది.

ఈ ఘటనలో ASI మీనాతో పాటు, మరణించిన ఇతర ప్రయాణికులను పాల్ఘర్‌లోని నాలాసోపరా నివాసి అబ్దుల్ కదర్‌భాయ్ మహ్మద్ హుస్సేన్ భన్‌పూర్వాలా , బీహార్‌లోని మధుబని నివాసి అస్గర్ అబ్బాస్ షేక్ , మహమ్మద్ హుస్సేన్‌లుగా గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 120 మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను చెక్ చేస్తున్నారు.

నిందితుడు చేతన్ సింగ్‌పై IPC సెక్షన్ 153ఆ ప్రకారం మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం కింద కేసు నమోదు చేయబడింది. అలాగే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 363 , సెక్షన్ 341, సెక్షన్ 342 సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story