Supreme court : ఇక రాయడాల్లేవ్

Supreme court : ఇక రాయడాల్లేవ్
సుప్రీంకోర్టులో ఇకపై పేపర్ లెస్ విధానం

సుప్రీంకోర్టు డిజిటలైజేషన్ గా దిశగా మరో అడుగు వేసింది. ఇకపై పూర్తి పేపర్ లెస్ విధానం అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో 50 ఏళ్ల సుప్రీంకోర్టు తీర్పు కాపీలను తొలగించింది.

42 రోజుల వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి సుప్రీంకోర్టు పునఃప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇకపై కోర్టు రూముల్లో అన్ని ఫైళ్లను డిజిటల్ మాధ్యమాల ద్వారా చూసే వెలుసుబాటు కల్పించినట్టుగా ప్రకటించింది. సాధారణంగా కోర్టు పనులన్నీ సినిమాల్లో చూసినట్టు నాలుగు రోజుల్లో రెండు మూడు కాగితాలు, ఓ సంతకం తో పూర్తయిపోతాయని అనుకుంటాం. కానీ ప్రాక్టికల్ గా చూస్తే అది నిజం కాదు కోర్ట్ అంటే కాగితాలు. కేసుని బట్టి పదుల సంఖ్యలో కాగితాలు. సంతకాల మీద సంతకాలు. ఇప్పుడు ఈ డిజిటలైజేషన్తో కాగితాల హడావిడి తగ్గిపోతుంది.. లాయర్లు, పిటిషన్ దారుల అందరూ తమ మొబైల్స్, టాబ్స్ లోనే కేసుల వివరాలు చూసుకోగలరు. ఇందుకోసం కోర్టు లాబీల్లో వైఫై సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ ప్రక్రియ లో భాగంగా సుప్రీం కోర్టు లోని మూడు కోర్టు రూముల్లో పూర్తిగా పేపర్ లెస్ విధానాన్ని తీసుకురానున్నారు. తరువాత ఇతర కోర్టు లకు కూడా విస్తరించునున్నారు. సుప్రీంకోర్టు 73 ఏళ్ల న్యాయవ్యవస్థ చరిత్రలోనే పూర్తిగా పేపర్‌లెస్‌గా మారడం ఇదే తొలిసారి.

Tags

Read MoreRead Less
Next Story