Maharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..

Maharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
Maharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో బిగ్‌ ట్విస్ట్‌.. ఉద్ధవ్‌ థాక్రే ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

Maharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో బిగ్‌ ట్విస్ట్‌.. ఉద్ధవ్‌ థాక్రే ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.. చివరకు సుప్రీంకోర్టులోనైనా ఊరట లభిస్తుందని ఆశించినా ఎదురుదెబ్బే తగిలింది.. బలపరీక్షపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. గవర్నర్‌ నిర్ణయాన్నే బలపరుస్తూ ఆదేశాలు ఇచ్చింది.. ఫ్లోర్‌ టెస్ట్‌ పిటిషన్‌పై మూడున్నర గంటలపాటు సుప్రీంకోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి..

ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు.. అయితే, చివరకు సుప్రీంకోర్టు గవర్నర్‌ నిర్ణయాన్నే సమర్థించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ముంబైలో భద్రత కట్టుదిట్టం చేశారు.. సాయంత్రం జరిగిన కేబినెట్‌ సమావేశంలో సీఎం ఉద్ధవ్‌ థాక్రే భావోద్వేగానికి గురయ్యారు.. అయిన వాళ్లే తనను మోసం చేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు..

సుప్రీంకోర్టు బలపరీక్షపై స్టేకు నిరాకరించడంతో సీఎం పోస్టుకు ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసేశారు. నమ్ముకున్న వాళ్లు, సొంత మనుషులే మోసం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. అందరూ కలిసి తనను నట్టేట ముంచారని ఉద్దవ్ థాక్రే వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే ఇప్పటివరకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి.. గత రెండున్నరేళ్లలో ఏమైనా తప్పులు చేసుంటే క్షమించాలని వేడుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story