Assom : బహు భార్యత్వం నిషేధ దిశగా అసోమ్

Assom :  బహు భార్యత్వం నిషేధ దిశగా అసోమ్
ఏకగ్రీవ ఆమోదం తెలిపిన నిపుణుల కమిటీ

అసోం ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. బహు భార్యత్వంపై నిషేధం విధించే దిశగా హిమంత బిస్వ శర్మ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. బహు భార్యత్వం నిషేధంపై న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ దానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని హిమంత బిస్వా శర్మ చెప్పారు. బిల్లుపై గవర్నర్‌కు బదులుగా రాష్ట్రపతి ఆమోదించేలా చేయాలని కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో బిల్లుని ఈ ఆర్థిక సంవత్సరంలో కచ్చితంగా ప్రవేశపెట్టేలా హిమంత పావులు కదుపుతున్నారు. వచ్చే సెప్టెంబర్, డిసెంబర్‌ నెలల్లో జరిగే శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలని భావిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో బిల్లును తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు హిమంత తెలిపారు.

నిజానికి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్‌ ప్రస్తావన తీసుకొచ్చేందుకు సీఎం హిమంత బిశ్వ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. యునిఫామ్ సివిల్‌ కోడ్‌(UCC) లో యాంటీ పాలిగమీ ( anti-polygamy bill) అనేది ఓ భాగం అని తేల్చి చెప్పారు. నిజానికి అస్సాంలో ఇలాంటి చట్టాన్ని ఎన్నడూ ప్రవేశపెట్టలేదు కాబట్టి ఈ బిల్లుపై చర్చకు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాల్సి ఉంటుందని, ఈ విషయంపై తమ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రాష్ట్ర ప్రణాళికాబద్ధమైన బహుభార్యత్వ చట్టానికి ముందు యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అమల్లోకి వస్తే, పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు.


నిజానికి ఈ ఏడాది మే నెలలోనే యాంటీ పాలిగమీకి సంబంధించిన లీగాలిటీపై చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని కూడా నియమించింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ ప్యానెల్‌కి గువాహటి హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ రూమి ఫుకాన్ నేతృత్వం వహించారు. ఇప్పుడు ఆ పానల్ దానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లుపై గవర్నర్‌కు బదులుగా రాష్ట్రపతి ఆమోదించేలా చేయాలని కమిటీ సూచించింది. ముస్లిం మహిళల మేలు కోరే ఈ చట్టం చేసేందుకు సిద్ధమవుతున్నామని ఇప్పటికే హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. మహిళలకూ సమాన హక్కులు కల్పించాలన్నదే UCC ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. పురుషులతో సమానంగా పోటీ పడేందుకు ఇది తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.

భారత్‌లో ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉండటం చట్టరీత్యా నేరం. హిందూ వివాహ చట్టం ఇందుకు సమ్మతి లభించదు. ఇండియన్ పీనల్ కోడ్‌ ప్రకారమూ ఇది నేరంమే గానే పరిగణిస్తారు. బౌద్ధులు, జైనులు, సిక్కులు కూడా హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తారు. అయితే...ముస్లిం చట్టంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇస్లాం మతానికి చెందిన పురుషులు నలుగురు మహిళలను పెళ్లి చేసుకునేందుకు సమ్మతి ఉంటుంది. కాకపోతే...వాళ్లందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story