Union Budget 2024-25 : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Union Budget 2024-25 : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఏ శాఖకు ఎంతిచ్చారంటే..!

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను గురువారం ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా ఇందులో మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. రక్షణ శాఖకు రూ.6.2 లక్షల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

ఏ శాఖకు ఎంతంటే.. (రూ. లక్షల కోట్లలో)

ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు రూ. 2.౭౮

రక్షణ రంగానికి రూ 6.2 లక్షల కోట్లు

రైల్వే శాఖకు రూ. 2.55

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీకి రూ. 2.13 లక్షల కోట్లు

హోం శాఖకు రూ. 2.03

గ్రామీణాభివృద్ది శాఖకు రూ.1.77

రసాయనాలు, ఎరువులకు రూ.1.68

కమ్యూనికేషన్ రూ.1.37

వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.27

Tags

Read MoreRead Less
Next Story