Supreme Court : సుప్రీంకోర్టులో ముక్తార్‌ అన్సారీ తనయుడి పిటిషన్‌

Supreme Court : సుప్రీంకోర్టులో ముక్తార్‌ అన్సారీ తనయుడి పిటిషన్‌
యూపీ ప్రభుత్వం స్పందన కోరిన కోర్టు

జైలులో ఇటీవల మృతి చెందిన ముక్తార్‌ అన్సారీ ఫతేహ (ప్రత్యేక ప్రార్థన) ఈ నెల 10న జరుగనున్నది. జైలులో ఉన్న ఆయన తనయుడు అబ్బాస్‌ అన్సారీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతిని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ సమాధానం కోరింది. గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయవేత్తగా మారిన ముక్తార్‌ అన్సారీ మార్చి 28న యూపీ బండాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. క్రిమినల్‌ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న అబ్బాస్‌ అన్సారీ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ జాబితా కాలేదు. ఈ క్రమంలో పిటిషన్‌ను సవరించి ఈ నెల 10న జరిగే ఫతేహాకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది కోరారు. ఈ మేరకు కోర్టు యూపీ ప్రభుత్వానికి ఈ నెల 9లోగా స్పందన తెలియజేయాలని సూచించింది. కేసు విచారణ మళ్లీ ఈ నెల 9న జరుగనున్నది.

మాఫియా ముఖ్తార్ అన్సారీ మార్చి 28న గుండెపోటుతో మరణించారు. కానీ ముఖ్తార్ మరణం సాధారణ మరణంగా అనిపించడం లేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ముక్తార్ అన్నయ్య, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ తన సోదరుడిని పాలలో విషం కలిపి చంపేశారని పదేపదే అంటున్నారు. ముఖ్తార్ చిన్న కుమారుడు ఒమర్ కూడా అదే విషయాన్ని నొక్కి చెబుతున్నాడు. ఇంతలో అఫ్జల్ అన్సారీ ఓ పెద్ద విషయం చెప్పాడు. ఇవాళ కాకపోయినా 20 ఏళ్ల తర్వాత ముక్తార్‌కు కచ్చితంగా న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ కథను ముగించామని ప్రభుత్వం అనుకుంటుంది.. కానీ అలా కాదని అఫ్జల్ అన్నాడు. ఈ కథ ఇప్పుడే మొదలవుతుంది. అఫ్జల్ మాట్లాడుతూ, ‘నా సోదరుడు ముఖ్తార్ అవశేషాలు భద్రపరచబడ్డాయి. మరో 20 ఏళ్ల తర్వాత విచారణ జరిపినా అతని గోళ్లు, వెంట్రుకలు భద్రంగా ఉండేలా అతడి మృతదేహాన్ని ఖననం చేశారు. వారి ద్వారానే విచారణ జరిగి ముఖ్తార్ మృతికి గల కారణాలు తెలుస్తాయి’ అని అఫ్జల్ అన్సారీ తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story