Cbi Chargesheet : పోలీసుల కళ్లెదుటే ఆ ఘొరం

మణిపూర్ ఘటనలో బయటికొచ్చిన షాకింగ్ విషయాలు.

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ఓ గుంపు నగ్నంగా ఊరేగిస్తూ, కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మణిపూర్ పోలీసులే మహిళలను గుంపు దగ్గరికి తీసుకెళ్లారని సీబీఐ ఆరోపించింది. గతేడాది మే 4న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కేసులో అక్టోబర్‌లో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. అదే కుటుంబానికి చెందిన మూడవ మహిళపై గుంపు దాడి చేసి.. ఆమె దస్తులు కూడా విప్పేందుకు ప్రయత్నించిందని పేర్కొంది. కానీ, ఆమె చిన్న మనవరాలని గట్టిగా పట్టుకోవడం వల్ల విఫలమైందని పేర్కొంది. ముగ్గురు మహిళలు.. స్పాట్ లో ఉన్న పోలీసు సిబ్బంది సహాయం కోరారు. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. చివరకు, గుంపు దయతోనే గుంపు వదిలిపెట్టారని తెలిపింది సీబీఐ. ఈ కేసులో ఆరుగురు నిందితులపై సీబీఐ ఛార్జిషీట్‌ ఫైల్ చేసింది.

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ ఘర్షణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అక్టోబరులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలపై అల్లరిమూకలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. పోలీసులే వారికి సహకరించారని పేర్కొంది. ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు.. సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోలేదని వెల్లడించింది. గతేడాది మే 4 న కాంగ్‌పోక్పీ జిల్లాలో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన అల్లరి మూక.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

మైతీ మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ -జోమి వర్గానికి చెందిన మహిళలు ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి ఆశ్రయం కోరితే.. స్వయంగా పోలీసు సిబ్బందే బాధితులను అల్లరిమూకలకు అప్పగించినట్లు ఛార్జిషీటులో తెలిపింది. ఆ తర్వాతే ఆ మహిళలను వివస్త్రలుగా ఊరేగించి, వరిపొలాల్లో అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సీబీఐ వివరించింది. కార్గిల్‌ యుద్ధవీరుడి భార్య అయిన ఓ బాధితురాలు... తమను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాలని పోలీసులను వేడుకుంటే.. ‘జీపు తాళాలు లేవు’ అని బుకాయించారని బయటపెట్టింది. ఈ ఘటన జరిగి ఏడాది కావస్తుండగా.. అక్టోబరులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏకే 47, ఇన్సాస్, 303 రైఫిల్స్ సహా అత్యాధునిక ఆయుధాలతో కూడిన 900 నుంచి 1000 మంది గుంపు.. గ్రామంలోకి చొరబడి ఇళ్లకు నిప్పంటించిందని సీబీఐ తెలిపింది. అల్లరి మూక గ్రామాన్ని దోచుకుంటున్నప్పుడు బాధిత మహిళలు, మరో ఏడుగురు వారి నుంచి తప్పించుకోడానికి సమీపంలోని హౌఖోంగ్‌చింగ్ అడవిలోకి పరిగెత్తారు. కానీ, దురదృష్టవశాత్తూ వారి కంటబడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story