RAINS ALERT: మళ్లీ యమున మహోగ్రరూపం.. వణికిపోతున్న ఢిల్లీ

RAINS ALERT: మళ్లీ యమున మహోగ్రరూపం.. వణికిపోతున్న ఢిల్లీ
ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో ఢిల్లీలో యమునా నది మహోగ్రరూపం... అప్రమత్తమైన కేజ్రీవాల్‌ సర్కార్‌..

దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది (Yamuna) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో యమునా నీటిమట్టం మళ్లీ ప్రమాదకరస్థాయి (Danger level) దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని (Delhi) పాత రైల్వే బ్రిడ్జి వద్ద (Old Railway Bridge) యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరడంతో అధికారులు హైఅలర్ట్(Delhi on high alert) ప్రకటించారు.

ఉత్తరాఖండ్ (Uttarakhand)‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో (Himachal Pradesh) రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో హర్యానాలోని (Haryana) హత్నికుండ్‌ బరాజ్‌ (Hathnikund Barrage) నుంచి ప్రభుత్వం 2 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దిగువన ఉన్న న్యూఢిల్లీకి మళ్లీ వరద పోటెత్తింది. వరద నీరు పోటెత్తడంతో ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్((Yamuna water level likely to breach danger mark again) కు చేరుకుంది.


యమునా నది తీరప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. లోతట్టుప్రాంతాలను యమునా నది వరద ముంచెత్తే ప్రమాదం ఉండటంతో ఢిల్లీ సర్కారు సహాయ పునరావాస పనులను చేపట్టింది. యమునా నది నీటిమట్టం పెరగడంతో తాము అప్రమత్తం అయ్యామని ఢిల్లీ రెవెన్యూశాఖ మంత్రి అతిషి చెప్పారు. సెంట్రల్ జిల్లా, తూర్పు జిల్లా, యమునా బజార్ ప్రాంతాల్లో అధికారులు పునరావాస చర్యలు చేపట్టారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీకి భారీ వరద పోటెత్తుతోందని అధికారులు హెచ్చరించారు.

కేజ్రీవాల్‌ ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది. జూలై 25 వరకు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Very heavy rain) కురిసే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ ప్రకటనతో ఢిల్లీకి మరింత వరద ముప్పు పొంచిఉన్నట్లయింది. కొన్నిరోజులుగా ఢిల్లీలో యమునా నది 205.33 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నదీ ప్రవాహం ప్రమాద స్థాయికి తగ్గినప్పటికీ.. మళ్లీ పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 13న యమునా నది 208.66 మీటర్లు ప్రవహించింది. అనంతరం క్రమంగా తగ్గుతూ వస్తున్నది.


హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏళ్లలో ఎన్నడూలేనంతగా వానలు (Heavy rains) కురిసినట్లు అధికారులు తెలిపారు. వరదలు (Floods) పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వంద మందివరకు మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు (CM Sukhvinder Singh Sukhu) వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story