బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై సునీల్‌ గవాస్కర్‌ ఆగ్ర‌హం

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు సమీక్ష చేయకుండానే సారథిగా విరాట్‌ కోహ్లీని తిరిగి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా.. లేక కోహ్లి నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా అనే విమర్శలు వచ్చాయి. ఈ సెలక్షన్‌ కమిటీకి ఇదే చివరి ఎంపిక అని ఆయన వ్యాఖ్యానించారు. వెస్టిండీస్‌ పర్యటనకు జట్టును ఎంపిక చేసేముందు కనీసం సారథ్యం గురించి సమావేశం నిర్వహించలేదన్నారు.

కోహ్లీని సారథిగా ఎంపిక చేసింది ప్రపంచకప్‌ వరకే అన్నారు సునీల్‌ గావస్కర్‌.. సారథిని తిరిగి ఎంపిక చేసేందుకు సెలక్టర్లు కనీసం ఐదు నిమిషాలైనా కేటాయించలేదు అని విమర్శించారు. వరల్డ్‌కప్‌లో ఆడిన కొంతమంది ఆటగాళ్లను ఏ రకంగా తప్పించారని గవాస్కర్‌ నిలదీశాడు. ఒకవేళ ఆయా ఆటగాళ్ల ప్రదర్శన బాగాలేదని అనుకుంటే, మరి భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించకపోయిన కెప్టెన్‌గా కోహ్లినే కొనసాగించడం తప్పుడు సంకేతాలకు దారి తీయదా అని ప్రశ్నించాడు బీసీసీఐని గవాస్కర్.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

విద్యార్థినిపై కాలేజీ లెక్చరర్‌ లైంగిక వేధింపులు

Tue Jul 30 , 2019
రోజు రోజుకు టిక్‌టాక్‌ మోజు శృతిమించిపోతోంది. పాటలతో తమ హావభావాలను ప్రదర్శిస్తూ వాటిని అమ్మాయిలకు పంపిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇదే కోవలో ఓ లెక్చరర్‌ విద్యార్థినుల్నివేధింపులకు గురిచేశాడు. విద్యార్ధులకు ఆదర్శంగా ఉండి.. వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన లెక్చరర్‌ వేధింపులకు పాల్పడ్డాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో HODగా పనిచేస్తున్న సురేందర్.. విద్యార్థినుల్ని లైంగికంగా టార్చర్ చేశాడు. వాట్సాప్‌లో అసభ్యకర పోస్టులు , టిక్‌టాక్‌ వీడియోలు […]