మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌ మధ్య నిలిచిన పలు రైళ్లు

మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌ మధ్య నిలిచిన పలు రైళ్లు
X

మహబూబ్‌నగర్ జిల్లా మన్నెంకొండ రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలు చెక్‌ చేసే రైలింజన్ అదుపు తప్పింది. దీంతో రైళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా పండగ కావడం, బస్సులు సరిగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే సిబ్బంది రైలింజన్‌ను తొలగించి పట్టాలను సరిచేశారు. దీని ప్రభావంతో మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌ మధ్య రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Tags

Next Story