VSP: ఒక్కరోజులోనే కొట్టుకుపోయిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జీ

VSP: ఒక్కరోజులోనే కొట్టుకుపోయిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జీ

విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం ప్రారంభించిన నీటిపై తేలే వంతెన తెగిపోయింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్... రెండో రోజే తెగిపోయింది. సుమారు 100 మంది సందర్శకులు నిలబడేలా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరిభాగంవిడిపోయి...సముద్రంలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఆ సమయంలో సందర్శకులు వంతెనపై లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైపు ప్రజలు వెళ్లకుండా...... భద్రతా ఏర్పాట్లు చేశారు. నిర్వహణలో భాగంగానే వంతెన తెగిందన్న బ్రిడ్జ్ నిర్వహణ సంస్థ... తెగిన భాగాన్ని తీసుకొచ్చి మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపింది. ప్రారంభించిన ఒక్క రోజులోనే విశాఖలో నీటిపై తేలే వంతెన తెగిపోయింది. చివరి భాగం విడిపోయి కొద్దిదూరం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఫ్లోటింగ్‌ బ్రిడ్జిను ఆదివారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఫ్లోటింగ్‌ బ్రిడ్జి వైపు ప్రజలు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారు. అయితే, నిర్వహణలో భాగంగా వంతెనను విడదీసినట్లు నిర్మాణ సంస్థ చెబుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని సందర్శనకు అనుమతిస్తామని తెలిపింది.

Next Story