AP: మరో రూ.4 వేల కోట్ల అప్పు చేసిన జగన్‌ సర్కార్‌

AP: మరో రూ.4 వేల కోట్ల అప్పు చేసిన జగన్‌ సర్కార్‌

సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వు బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో 4 వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. వెయ్యి కోట్ల రూపాయల చొప్పున మూడు లాట్లు, 500 కోట్ల రూపాయల చొప్పున రెండు లాట్లలో సెక్యూరిటీల వేలం వేసి ఈ రుణాన్ని తీసుకున్నారు. 5 ఏళ్ల నుంచి 19 ఏళ్ల పాటు చెల్లింపు కాలవ్యవధిలో 4 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర 5 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4 వేల కోట్ల రుణాన్నీ తీసుకున్నాయి. ప్రస్తుత నాలుగు వేల కోట్ల రుణంతో ఏపీ ఈ ఏడాదిలో తెచ్చిన అప్పు 1.02 వేల కోట్ల రూపాయలకు చేరింది. అనుమతించిన స్థాయి కంటే అప్పులు చేసి ఎఫ్ఆర్ బీఎం నిర్దేశించిన పరిధిని ఇప్పటికి 22 సార్లు ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి.

Next Story