PAK vs SL: మొదటి రోజు ఆట ఇద్దరిదీ..

PAK vs SL: మొదటి రోజు ఆట ఇద్దరిదీ..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్ట్ ఆదివారం ప్రారంభమైంది. శ్రీలంక ఆటగాడు ధనంజయ డిసిల్వా 94 పరుగులతో రాణించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను పాక్ పేస్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టాడు. పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఎంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వాలు 131 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. మ్యాచ్‌ మధ్యలో వర్షం అంతరాయం కేవలం 70 ఓవర్ల ఆటే సాధ్యమైంది.

18 పరుగులకే ఓపెనర్ నిషాన్ మధుష్క వికెట్ కోల్పోయింది. షాహీన్ ఆఫ్రిదీ, ఇతర బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో కేవలం 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఫాంలో ఉన్న ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వాలు పట్టుదలతో ఆడుతూ వికెట్లు పడకుండా ఆడారు. వీరిద్దరి జోడి 88 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగుల భాగస్వామ్యం దాటించారు. తర్వాత డిసిల్వా 4 ఫోర్లు, 2 సిక్సులతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మథ్యూస్ కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 64 పరుగులు చేసి అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ఉన్న ధనంజయ డిసిల్వా సదీరా సమరవిక్రమతో కలిసి నెమ్మదిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా కాపాడారు. అయితే మొదటి రోజు ఆట చివరి బంతికి సమరవిక్రమ 6వ వికెట్‌గా వెనుదిరిగాడు. ధనంజయ డిసిల్వా 97 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిదీ 3 వికెట్లు తీశాడు. నసీం ఫా, అబ్రార్ అహ్మద్, సల్మాన్‌లు చెరో వికెట్ తీశారు.

Tags

Read MoreRead Less
Next Story