ఎంపీగా అవకాశం రావడమే గొప్పని.. మంత్రి పదవిపై ఆశ లేదన్నారు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌. తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారాయన. కేంద్ర నిధులతో రాష్ట్రంలో ఎన్నో పనులు జరుగుతున్నాయని.. అవన్నీ రాష్ట్ర పథకాలే అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఈ నెల30న కరీంగనగర్‌లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తామన్నారు బండి సంజయ్‌.