Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరో షాక్

Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరో షాక్

లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (Kavitha) మరో షాక్ తగిలింది. నేటితో జుడీషియల్ గడువు ముగియగా ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ విజ్ఞప్తి మేరకు రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. కవితను కోర్టులో మాట్లాడేందుకు జడ్జి అనుమతి నిరాకరించారు. అయితే జడ్జి అనుమతితో కుటుంబ సభ్యులు కవితను కలిశారు.

కాగా రిమాండ్ పొడిగించేందుకు ఈడీ వద్ద కొత్తగా కారణమేమీ లేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. గత నెల 15న కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను నిన్న కోర్టు కొట్టేసింది. కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ పేర్కొంది.

మరోవైపు ఎమ్మెల్సీ కవిత మీడియాకు నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. ‘లిక్కర్ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. నేను తప్పు చేశాననడానికి ఆధారాలు కూడా లేవు. రెండున్నరేళ్ల విచారణలో ఎలాంటి రుజువు లభించలేదు. వేరే వ్యక్తుల స్టేట్‌మెంట్‌తో నన్ను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నేను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు. కేవలం బాధితురాలిని మాత్రమే’ అని కవిత పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story