Atma Nirbhar Bharat: రక్షణా రంగానికి 'స్వయ' అభయహస్తం

Atma Nirbhar Bharat: రక్షణా రంగానికి  స్వయ అభయహస్తం
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రక్షణా రంగంలో కీలక పరిణామం ; స్వయ రోబోటిక్స్ అభివృద్ధి చేసిన స్వదేశీ రోబో

దేశ రక్షణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రస్తుతం అమెరికా, స్విట్జర్ల్యాండ్ నుంచి ఆధునిక సాంకేతికతో కూడుకున్న రోబోలను దిగుమతి చేసుకుంటోన్న విషయం తెలిసిందే. అయితే, దీనికి చెక్ పెడుతూ పూర్తి దేశీయ టెక్నాలజీతో కూడుకున్న రోబోను 'స్వయ' రోబోటిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. భారతదేశపు మొట్టమొదటి చతుర్భుజ రోబోను తయారు చేసిన స్వయ ఎక్సో స్కెలిటన్ ను DRDO ల్యాబ్స్ - రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, పూణే (R&DE), డిఫెన్స్ బయో-ఇంజనీరింగ్ & ఎలక్ట్రో మెడికల్ లాబొరేటరీ, బెంగళూరు (DEBEL) సహకారంతో అభివృద్ధి చేసింది. "మేక్-ఇన్-ఇండియా" కార్యక్రమంలో భాగంగా దేశీయంగా వీటిని అభివృద్ధి చేయడానికి DRDO నాయకత్వం వహించడంతో రోబోటిక్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంది. కేంద్ర రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు అయిన డా. సతీష్ రెడ్డి, DRDO మాజీ ఛైర్మన్, DRDO ల్యాబ్‌ల ఇతర సీనియర్ శాస్త్రవేత్తలు - R&DE, DEBEL హైదరాబాద్‌లోని స్వయా రోబోటిక్స్ అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. DRDO ఇన్‌పుట్‌లతో అభివృద్ధి చేసేందుకు స్వయా చేపట్టిన రోబోల అభివృద్ధిని డాక్టర్ సతీష్ రెడ్డి సమీక్షించారు. “చాలా తక్కువ వ్యవధిలో స్వయా రోబోటిక్స్ సాధించిన పురోగతికి సంతోషంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారతదేశంలో అధునాతన రోబోటిక్‌ల అభివృద్ధిని వేగవంతం చేయడానికి, వాటిని వేగంగా ఫీల్డ్ ట్రయల్స్‌లోకి తీసుకువెళ్లడానికి స్వయా రోబోటిక్స్ వంటి సంస్థల సహకాలం ఎంతో అవసరం అని తెలిపారు.


స్వయా రోబోటిక్స్, పదేళ్ల నుంచి అత్యాధునిక మానవ-అగ్మెంటింగ్ రోబోటిక్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా కొనసాగుతోంది. భారతదేశంలో మొట్టమొదటి సహకార రోబోలను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story