ఆటోల్లో అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఆటోల్లో అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ తో రోడ్డు మీద పడ్డ ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని బీఆర్ఎస్ (BRS) డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు.

హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అసెంబ్లీ వరకూ ప్రయాణించారు. కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో 6.5 లక్షల మంది రోడ్డున పడ్డారని, వారికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు.

మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద హై టెన్షన్ నెలకొంది. ఆటో డ్రైవర్ల సమస్యలపై నిరసన చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో అసెంబ్లీ ప్రాగంణంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపు వాగ్వాదం తర్వాత లోపలికి అనుమతించారు.

Tags

Read MoreRead Less
Next Story