Hyderabad : చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం..

Hyderabad : చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం..
Hyderabad : చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ను హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు.

Hyderabad : హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో మరోసారి మంత్రి కేటీఆర్‌ పర్యటన రద్దైంది. దీంతో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ను హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడం కోసం ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి SRDP ఫలాలు. సిగ్నల్‌ ఫ్రీ నగరంగా చేసేందుకు SRDPని తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్‌. 41 పనుల్లో ఇప్పటికే 30 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ను 45 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీని వల్ల శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుండి ఎల్బీనగర్‌ మీదుగా నల్గొండ, వరంగల్‌ వెళ్లేందుకు మార్గం సులభతరమవుతుంది. ఈ నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌.. 674 మీటర్ల పొడవు ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story