తెలంగాణలో కరోనా కలకలం.. పాఠశాలల మూసివేతకు విద్యాశాఖ ప్రతిపాదన

తెలంగాణలో కరోనా కలకలం.. పాఠశాలల మూసివేతకు విద్యాశాఖ ప్రతిపాదన
తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపించడానికి విద్యార్ధులే ఓ వెహికల్‌గా మారుతున్నట్టు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు.

మరోసారి పంజా విసురుతున్న కరోనా.. విద్యార్ధుల తల్లిదండ్రులను టెన్షన్ పెడుతోంది. ఈ మధ్య నమోదవుతున్న పాజిటివ్‌ కేసులలో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుండడం మరింత కలవర పెడుతోంది. విద్యార్ధుల ప్రాణాలే ముఖ్యమంటూ గతంలో స్కూళ్లు మూసేసింది ప్రభుత్వం. కరోనా సెకండ్‌వేవ్‌ అంటూ వార్తలు వస్తున్నందున స్కూళ్లకు సెలవులు ప్రకటించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే వైద్యా శాఖ ఓ ప్రతిపాదన కూడా పంపింది. పదో తరగతి వరకు బడులన్నీ మూసేస్తేనే మంచిదని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. విద్యార్ధులకు మాత్రమే కాదని, విద్యార్ధుల నుంచి కుటుంబ సభ్యులకు, వారి నుంచి ఇతరులకు కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నివేదిక ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్ల మూసివేతపై ఇవాళ రేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపించడానికి విద్యార్ధులే ఓ వెహికల్‌గా మారుతున్నట్టు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. తఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఓ అంచనా. పిల్లల్లో సాధారణంగానే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండడం, టీకాలు వేసుకుని ఉండడం వల్ల పాజిటివ్‌ ఉన్నా లక్షణాలు బయటికి కనిపించడం లేదని అంటున్నారు. కాకపోతే, వీరి నుంచి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కరోనా సోకవచ్చని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలో ఉన్నట్టుండి కరోనా రోగుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణమని భావిస్తున్నారు. కరోనా కట్టడికి పాఠశాలలు, కాలేజీలు, గురుకులాలు మూసివేయడం ఉత్తమమని వైద్యశాఖ సూచించింది.

నిజానికి స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కరోనా నిబంధనలు పాటించడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు నడిపితే కరోనా కట్టలు తెంచుకోవచ్చని, కనీసం 9వ క్లాస్‌ వరకు తరగతులు పెట్టకపోవడమే మంచిదని వైద్యశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం ఇవాళ రేపట్లో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story