TS : డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్ ప్రయారిటీ తగ్గిస్తున్నారా..?

TS : డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్ ప్రయారిటీ తగ్గిస్తున్నారా..?

రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. పార్టీని ఒక్కటి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో ఒకచోట ఏదో పొరపాటు కాంట్రవర్సీ అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచి భట్టి విక్రమార్కకు ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గుతోందని గుసగుసలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భట్టికి రేవంత్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లే వారు. ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రకటనల్లో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్కకు ప్రాధాన్యం లభించేది. ప్రజాభవన్ గా మార్చిన ప్రగతి భవన్ లో గతం లో కేసీఆర్ ఉన్న భవనాన్ని భట్టి విక్రమార్కకు కేటాయించారు. రేవంత్ మాత్రం సొంత ఇంట్లోనే ఉంటున్నారు. భట్టికి గౌరవం విషయంలో సీఎం స్థాయే ఉందనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

మొదట్లో పత్రికల్లో కూడా రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క ఫోటో కనిపించేది. ప్రతీ కార్యక్రమంలోనూ భట్టి విక్రమార్క కనిపించేవారు. ఎన్నికల వాతావరణం మొదలైనప్పటినుంచి ఈ మధ్య భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పక్కన పెద్దగా కనిపించడం లేదు. అంతకు మించి ప్రభుత్వ పరమైన ప్రకటనల్లోనూ ఆయన ఫోటో కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్‌లోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆమె మీడియా ఇంటర్యూల్లో రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. భట్టికి రావాల్సిన సీఎం సీటు రేవంత్ తీసుకున్నారన్నట్లుగా మాట్లాడుతున్నారు. అలా.. భట్టి కేంద్రంగా రేవంత్ ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ కట్టుకథలే అని రేవంత్ వర్గం అంటోంది.

Tags

Read MoreRead Less
Next Story