Nalgonda : తాగుబోతు ప్రిన్సిపల్.. అడ్డంగా బుక్కయ్యాడు..

Nalgonda : తాగుబోతు ప్రిన్సిపల్.. అడ్డంగా బుక్కయ్యాడు..
Nalgonda : తల్లిదండ్రీ గురువూ దైవం అంటారు. మనల్ని కన్న తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువులదే

Nalgonda : తల్లిదండ్రీ గురువూ దైవం అంటారు. మనల్ని కన్న తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువులదే. అంటే దేవుడి కంటే విద్యాబుద్ధులు నేర్పే గురువులే గొప్పవాళ్లు అంటున్నాం. కానీ మనం చూడబోయే గురువు మాత్రం కంప్లీట్ డిఫరెంట్. విద్యార్థులకు నేర్పేది, చెప్పేది ఏం ఉండదు. ఫుల్లుగా తాగి.. తూలుతూ స్కూలుకు వస్తాడు. హ్యాపీగా కునుకు తీస్తాడు, టైం కాగానే వెళ్లిపోతాడు. అంతే ఇదే సీన్ రోజూ రిపీట్ అన్నమాట. ఈతాగుబోతు మష్టారు ఏకంగా ఆ స్కూలుకే హెడ్‌ మాస్టర్‌ కావడం మరో విశేషం.

ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం రామపురం ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్లో జరిగింది. ఈ తాగుబోతు హెడ్‌ మాస్టర్ పేరు నవిలే ఉపేందర్. రోజూ ఇలాగే తాగి స్కూల్‌కు వస్తున్నాడు. హెడ్‌ మాస్టర్‌ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు.. విషయం పెద్దలకు చెప్పారు. దీంతో ఊరంతా వచ్చి ప్రిన్సిపల్‌ను నిలదీశారు. అప్పటికే మాంచి కిక్కులో ఉన్న హెడ్‌మాస్టర్‌... తలతిక్క సమాధానాలు చెబుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఇక ఉపాధ్యాయ వృత్తికే మచ్చతెచ్చేలా వ్యవహరించిన ప్రిన్సిపల్‌ ఉపేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు.

Tags

Read MoreRead Less
Next Story