Hyderabad: కుక్క భయంతో మూడో అంతస్తునుంచి దూకిన డెలివరీ బాయ్.. చికిత్స పొందుతూ మృతి

Hyderabad: కుక్క భయంతో మూడో అంతస్తునుంచి దూకిన డెలివరీ బాయ్.. చికిత్స పొందుతూ మృతి
Hyderabad: కస్టమర్ పెంపుడు కుక్క బారి నుంచి కాపాడుకునేందుకు 'స్విగ్గీ' ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భవనం మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు.

Hyderabad: కస్టమర్ పెంపుడు కుక్క బారి నుంచి కాపాడుకునేందుకు 'స్విగ్గీ' ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భవనం మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.



గత బుధవారం 23 ఏళ్ల మహ్మద్ రిజ్వాన్ బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో నివసించే శోభన ఇంటికి ఆర్డర్ చేసిన ఫుడ్ పార్శిల్ అందించేందుకు వెళ్లాడు. డోర్ బెల్ కొట్టగానే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క రిజ్వాన్‌ మీదకు ఉరికింది. దీంతో భయపడిన రిజ్వాన్ కుక్క నుంచి తప్పించుకునేందుకు పరిగెట్టాడు.. అయినా వెంట పడడంతో మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీంతో తలకు బలమైన గాయాలయ్యాయి.



శోభన వెంటనే అతడిని అక్కడి నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూనే రిజ్వాన్ మృతి చెందాడు.. శోభన నిర్లక్ష్యం కారణంగా తన సోదరుడు మృతి చెందాడని రిజ్వాన్ సోదరుడు ఆరోపిస్తున్నాడు. పెంపుడు కుక్కలు ఉన్నవాళ్లు వాటిని కట్టివేయాలి. కుక్కలంటే అందరికీ ప్రేమ ఉండాలని లేదు.. ముందు వాటిని చూస్తే భయమే ఎక్కువ వుంటుంది. అయినా కొత్త వారిని చూస్తే అవి అరుస్తాయి. ఓనర్లు మరీ అంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు పోయిన ప్రాణం ఏం చేస్తే తిరిగొస్తుంది అని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story