Gangula kamalakar : కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలనుకున్నా మీరేమి చేయలేరు : మంత్రి గంగుల కమలాకర్
Gangula Kamalakar : వైసీపీ నేతలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టేలా జగన్ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. జగన్ పార్టీ.. బీజేపీకి బి పార్టీగా నిలుస్తోందన్నారు. సజ్జల, అమర్నాథ్, టీఆర్ఎస్ కుటుంబంపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తమ సంగతి తెలియదా..? మళ్లీ చూస్తారా..? అంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు మంత్రి గంగుల కమలాకర్. సజ్జల రామకృష్ణా రెడ్డి బుద్ధి.. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టేదంటూ ఫైరయ్యారు.
జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావడంతోనే తెలంగాణకు వలసలు పెరిగాయంటున్న మంత్రి గంగుల కమలాకర్.. తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్‌పై ఎందుకు విషం చిమ్ముతున్నారంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి.. వైఎస్ కుటుంబంలోకి వచ్చి తల్లిని కుమారుడుని, చెల్లిని-అన్నను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఇక కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలనుకున్నా వైసీపీ నేతలు ఏమీ చేయలేరన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com