Home Voting: నేడు, రేపు హోం ఓటింగ్.. ప్రారంభమైన ప్రక్రియ

Home Voting:  నేడు, రేపు హోం ఓటింగ్.. ప్రారంభమైన ప్రక్రియ
హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో హోం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 121 మంది ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. వీరిలో 86 మంది సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు 35 మంది ఉన్నారు. ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటింటికి ఓటింగ్ నిర్వహించనున్నారు. ఓటర్లకు ఫోన్ చేసి, లేదా సమాచారం ఇచ్చి వారు అందుబాటులో ఉన్నప్పుడు ఎన్నికల సిబ్బంది బృందాలుగా ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి.. ఇంటింటికి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. కాగా, ఓటర్లందరూ అందుబాటులో ఉండాలని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు.

రాష్ట్రంలో గురువారం నుంచి లోక్‌సభ ఎన్నికలకు ఇంటి నుంచే ఓటు వేసే ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శుక్ర, శనివారాల్లో సౌలభ్యాన్ని బట్టి ఒకే రోజు కాకుండా ఇంటింటికి ఓటింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి ఓటు వేసేందుకు 23,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల అధికారులు ఇంటి ఓటింగ్‌ను 806 గ్రూపులుగా.. 885 రూట్లుగా విభజించారు. ప్రతి బృందంలో పోలింగ్ అధికారులతో పాటు వీడియో చిత్రీకరణ బృందం ఉంటుంది. ఈ నెల 6 గంటలలోగా ఇంటింటికి ఓటింగ్‌ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story