Kavitha : జుడీషియల్ కస్టడీ నేటితో ముగింపు.. కోర్టు ముందుకు కవిత

Kavitha : జుడీషియల్ కస్టడీ నేటితో ముగింపు.. కోర్టు ముందుకు కవిత

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను నేడు ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కవిత తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు తన అరెస్టును వ్యతిరేకిస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

తీహార్ జైల్లో ఉన్న తనను విచారించేందుకు సీబీఐకి అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు బుధవారం విచారణ చేపట్టనున్నది. సీబీఐ విచారణకు అనుమతివ్వడంపై గతవారం కవిత తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణను రీకాల్ చేయాలని అందులో కోరారు.

ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, దీనిపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను10 వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు కొడుకుకు పరీక్షలున్నాయంటూ కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్​ పిటిషన్​ను ట్రయల్​ కోర్టు తిరస్కరించింది.

Tags

Read MoreRead Less
Next Story