TS : ఫోన్ ట్యాపింగ్ చేసింది వాళ్లే.. కేసీఆర్ హాట్ కామెంట్

TS : ఫోన్ ట్యాపింగ్ చేసింది వాళ్లే.. కేసీఆర్ హాట్ కామెంట్

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రియాక్షన్ ను గులాబీ బాస్ కేసీఆర్ ఇచ్చేశారు. తెలుగు టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదన్నారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన ఏం జరిగినా అది తనకు సంబంధం లేదన్నారు.

ట్యాపింగ్‌ ఇంటెలిజెన్స్‌ డ్యూటీ అన్నారు మాజీ సీఎం కేసీఆర్. సీఎంకు, మంత్రులకు సంబంధం ఉండదని.. అవసరమైతే సీఎంలు కొన్ని రిపోర్టులు అడుగుతారని చెప్పారు. ఇవి పూర్తిగా పరిపాలనా సంబంధమైన అంశాలేనని కేసీఆర్ చెప్పారు. ఎవరైనా అధికారి అక్రమంగా చేస్తే, ఆ సంగతి డిపార్ట్‌మెంట్‌ చూసుకుంటుందనీ.. అలాంటి దుర్మార్గమైన పనిచేస్తే శిక్ష అనుభవిస్తారని చెప్పారు కేసీఆర్. దానికి పొలిటికల్‌ పార్టీకి సంబంధం ఉండదని కేసీఆర్ అన్నారు.

ట్యాపింగ్ కోసం ఏ ఎక్విప్ మెంట్ వాడారన్నది కూడా సీఎంకు అవసరం ఉండదని తెలిపారు కేసీఆర్. ప్రభుత్వ పరంగా తాము అడిగిన సమాచారం ఇస్తారని.. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్నది ప్రభుత్వ పరిధిలో ఉండదని.. అది డిపార్టుమెంట్ పరిధిలోని అంశమన్నారు కేసీఆర్.

Tags

Read MoreRead Less
Next Story