KCR: శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన కేసీఆర్‌

KCR: శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన కేసీఆర్‌
ధ్యాహ్నం 12:45 గంటలకు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు.

శాసనసభ సభ్యుడిగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్‌ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ తన చాంబర్ లో ప్రత్యేక పూజల అనంతరం స్పీకర్ కార్యాలయంకు వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్‌లో నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్... గజ్వేల్‌లో విజయం సాధించారు. ఆ వెంటనే ప్రమాదవ శాత్తూ కేసీఆర్ గాయపడటంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన రెండు నెలలుపాటు గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మదిగా నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో కేసీఆర్ అసెంబ్లీకి చేరుకొని, శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన చాంబర్ లో కేసీఆర్ ముందుగా పూజలు చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ కు చేరుకొని మధ్యాహ్నం 12.40 గంటలకు కేసీఆర్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.


Tags

Read MoreRead Less
Next Story