Khairatabad Ganesh 2022: చవితి వేడుకులకు సిద్ధమైన ఖైరతాబాద్‌ మహా గణపతి..

Khairatabad Ganesh 2022: చవితి వేడుకులకు సిద్ధమైన ఖైరతాబాద్‌ మహా గణపతి..
Khairatabad Ganesh 2022: వినాయక చవితి వేడుకులకు ఖైరతాబాద్‌ మహా గణపతి సిద్ధమయ్యాడు.

Khairatabad Ganesh 2022: వినాయక చవితి వేడుకులకు ఖైరతాబాద్‌ మహా గణపతి సిద్ధమయ్యాడు. ఈ ఏడాది శ్రీ పంచముఖి లక్ష్మీ గణపతి రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వనున్నాడు. సుప్రీంకోర్టు గైడ్‌లెన్స్‌, తెలంగాణ ప్రభుత్వ సూచనలతో 60 ఏళ్లలో మొదటి సారి ఖైరతాబాద్‌ వినాయకుడిని మట్టితో తయారు చేశారు. జూన్‌ 10 నుంచి వినాయక విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. 150 మంది మంది కళాకారులు విగ్రహ తయారీలో పాల్గొన్నారు.

వినాయకుడి కళ్లు పెట్టడంతో విగ్రహ తయారీ పూర్తయింది. ఈ సంవత్సరం 50 అడుగుల ఎత్తుతో గణేషుడు దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్‌ గణేషుడికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువు తీరారు. గణేష్‌ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే జరగనుంది. ఖైరతాబాద్‌ గణేష్‌ తయారీకి కోటి 50 లక్షల రూపాయల వ్యయం అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story