Regional Ring Road : తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ పనులు త్వరలో ప్రారంభం

Regional Ring Road : తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ పనులు త్వరలో ప్రారంభం
340 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకు మణిహారంలాంటిది. హైదరాబాద్ మరియు సమీప పట్టణాల మధ్య ట్రాఫిక్‌ను తగ్గించడంలో ఈ రోడ్డు కీలకపాత్ర పోషిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ ( Regional Ring Road ) నులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరిస్తోంది. అయితే, యుటిలిటీ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం కోరింది,గత ముఖ్యమంత్రి రూ. 300 కోట్ల యుటిలిటీ ఖర్చులను భరించలేమని లేఖ రాయడంతో పనులు ప్రారంభం కాలేదు.

ఈ నేపథ్యంలో, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేషనల్ హైవేస్ అథారిటీ ఛైర్మన్‌ను కలిసి చర్చిస్తామన్నారు . ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం యుటిలిటీ ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు, ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్తో రెడ్డి ( Revanth Reddy )గారితో చర్చించి, కేంద్రానికి లేఖ రాయిస్తామని మంత్రి అన్నారు.

340 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకు మణిహారంలాంటిది. హైదరాబాద్ మరియు సమీప పట్టణాల మధ్య ట్రాఫిక్‌ను తగ్గించడంలో ఈ రోడ్డు కీలకపాత్ర పోషిస్తుంది. దేశంలో మరెక్కడా ఇంత పెద్ద రింగ్ రోడ్డు ప్రాజెక్టు లేదు.రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరితే, నెల రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. రూ. 60 కోట్లకు ఒక టెండర్ చొప్పున బిట్లుగా పనిని విభజించి, త్వరగా పూర్తయ్యేలా చూస్తామని మంత్రి తెలిపారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే, తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో, రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో గణనీయమైన మార్పు వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు

Tags

Read MoreRead Less
Next Story