TS : ఓరుగల్లుకు కేటీఆర్.. టప్ గా మారిన వార్
వరంగల్ బీఆర్ఎస్ కు జోష్ ఇవ్వనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన వరంగల్ లో పర్యటించనున్నారు. పార్టీ ముఖ్యనేతలతో జరిగే సమావేశంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఇప్పటికే అన్ని పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్యనేతలతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పర్యటిస్తూ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయాలని కేసీఆర్ డిసైడయ్యారు. వరంగల్ ఈస్ట్ లో వర్గ విభేదాలు సెట్ రైట్ చేయాలని నిర్ణయించారు.
వరంగల్ లో బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికర పరిస్థితి చూస్తోంది. తమ పార్టీ నుంచి కీలక అభ్యర్థులు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లి అక్కడినుంచి ఎంపీలుగా పోటీచేస్తున్నారు. దీంతో.. గెలుపు వ్యూహాలపై కేటీఆర్ ఎక్కువగా ఫోకస్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com