ACB : ఏసీబీ వలలో జూలాజికల్ పార్క్ సీనియర్ అసిస్టెంట్

ACB : ఏసీబీ వలలో జూలాజికల్ పార్క్ సీనియర్ అసిస్టెంట్

హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సరాఫ్ రమేష్ రూ. 5 వేలు లంచం తీసు కుంటూ ఏసీబీ అధికారులకు పట్టు బడ్డాడు. ఈక్రమంలో సైదాబాద్ లో నివాసముంటున్న షరీఫ్ తన తల్లి ఫెన్షన్ మొత్తాలను వివాహం కాని తన సోదరి పేరిట బదిలీ చేయాలని సీనియర్ అసిస్టెంట్ రమేష్ ను సంప్రదించాడు. ఇందుకు రూ.10వేలు లంచం ఇవ్వాలని రమేష్ డిమాండ్ చేశాడు.

తాను రూ. 5 వేలు ఇవ్వగలనని చెప్పడంతో అందుకు సీనియర్ అసిస్టెంట్ రమేష్ అంగీకరించాడు. తనను లంచం డిమాండ్ చేసిన అధికారి రమేప్ పై ఎండి ఆజం షరీఫ్ నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు జూలాజికల్ పార్క్ వద్ద రూ. 5 వేలు లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ సరాఫ్ రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అనంతరం నగదు దాచిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి, నిందితుని చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించారు. లంచం తీసుకున్న కేసులో నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేసిన అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితునికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story