TS: వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే బీసీ జనగణన బిల్లు

TS: వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే బీసీ జనగణన బిల్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన... గులాబీపార్టీని బొందపెట్టేశారని వ్యాఖ్య....

లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారీ మోదీని ప్రధానిని చేసేందుకు బీజేపీతో బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం చేసుకుందని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిఆరోపించారు. అందుకే కేటీఆర్, హరీశ్‌రావు బీజేపీని పల్లెత్తుమాట అనకుండా.. కాంగ్రెస్‌పైనే విమర్శలు చేస్తున్నారని రేవంత్‌ దుయ్యబట్టారు. రేవంత్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో రాజ్యసభ, లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించే బాధ్యతలను AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్పగిస్తూ తీర్మానం చేసినట్లు రేవంత్ తెలిపారు. లోక్‌సభకు పోటీచేసే ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని....... చెప్పారు. ఆ దరఖాస్తులను అధిష్ఠానం నియమించిన కమిటీ పరిశీలించి అభ్యర్థులను ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ అభ్యర్థన మేరకు తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీచేస్తే ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీలు సహకరించాలని సీఎం కోరారు. కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడం తప్ప.... దేశానికి బీజేపీ చేసింది ఏదీలేదని రేవంత్‌ విమర్శించారు.


మోదీ దేశ ప్రజల మీద వంద లక్షల కోట్ల అప్పులు చేసి మోపారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన విభజన చట్టం హామీలు అమలవుతాయని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభతో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు చెప్పారు. ప్రజాసమస్యలపై కేటీఆర్, కేసీఆర్, హరీశ్‌ సహా ఎవరు సమయం అడిగినా ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాజకీయ కుట్రతోనే కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం వాయిదాకు తెరలేపారని.. ముఖ్యమంత్రి ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే విమర్శలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరిగేషన్ శాఖపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. బడ్జెట్‌లో హామీలకు సంబంధించిన కేటాయింపులు ఉంటాయని రేవంత్‌ చెప్పారు. ధరణి సహా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై.. చట్ట ప్రకారం విచారణ చేయిస్తున్నట్లు వివరించారు.


వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా..ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.... అధికారులను ఆదేశించారు. తాగునీరు అందని గ్రామాలను గుర్తించేందుకు సర్వే చేయాలని సూచించారు. గోదావరి, కృష్ణా నదులతో పాటు..మల్లన్న సాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక్ సాగర్ వంటి కొత్త రిజర్వాయర్లను...తాగునీటికి ఉపయోగించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామాలకు రక్షిత మంచి నీటిని చేర్చే బాధ్యత మిషన్ భగీరథ విభానిదేనని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో నల్లాలు, పైపులైన్ల నిర్వహణను మాత్రమే సర్పంచులకే అప్పగించాలన్నారు. ప్రతీ ఇంటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు గత ప్రభుత్వం చెప్పుకోవటంతో కేంద్ర జల జీవన్ మిషన్ నిధులురాలేదన్నారు. ఇప్పటికీ తెలంగాణలో చాలాచోట్ల తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇంజనీర్లు అలాంటి గ్రామాలను గుర్తించి.. పక్కాగా జాబితా సిద్ధం చేయాలన్నారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకునేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. తాగునీటి అవసరాల కోసం ప్రతి నియోజకవర్గానికి..కోటి రూపాయలను ఖర్చు చేయాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులు, పోలీసులకు యూనిఫామ్ లు కుట్టే పనిని స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని.... సూచించారు. రోడ్డు లేని గ్రామాలకు రోడ్లు నిర్మించాలన్నారు. రేపటితో సర్పంచుల పదవీకాలం ముగియనున్నందున ఇక అధికారులే చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story