Telangana: ప్రధానమంత్రి ఉపాధి కల్పన.. ట్రాన్స్ జెండర్ కు లోన్..

Telangana: ప్రధానమంత్రి ఉపాధి కల్పన.. ట్రాన్స్ జెండర్ కు లోన్..
తెలంగాణాలో ఉపాధి హామీ పథకం కింద లోన్ దక్కించుకున్న తొలి ట్రాన్స్ జెండర్ మహిళ; కరీమ్ నగర్ కలెక్టర్ చొరవతో...

ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద తెలంగాణాకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ మహిళకు లోన్ సాంక్షన్ అయింది. కరీమ్ నగర్ లో ఫొటో స్టూడియో పెట్టుకునేందుకు గానూ ఆమెకు ఎస్.బీ.ఐ. బ్యాంక్ నుంచి రుణం మంజూరు చేసినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఈ మేరకు షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన ఆశాకు రూ. 5లక్షల చెక్ స్వయంగా అందజేశారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద రుణం పొందిన తొలి ట్రాన్స్ జెండర్ మహిళగా ఆశ నిలిచారు. ఫొటో స్టూడియో ద్వారా ఆమె జీవితంలో ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాన్ని మంజూరు చేసిందని కర్ణన్ వెల్లడించారు. మరో ట్రాన్స్ జండర్ అయిన మహిళ ఎన్. సింధుకు కారు డ్రైవింగ్ లైసెన్స్ కేటాయించినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story